మరికాసేపట్లో ఉద్దవ్‌ థాకరేతో కెసిఆర్ భేటీ

సీఎం వెంట కవిత , ఎంపీలు

KCR meets Uddhav Thackeray
KCR meets Uddhav Thackeray

Mumbai: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబై చేరుకున్నారు. మరి కాసేపట్లో శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో సమావేశం కానున్నారు. ఈ భేటీ ముగిశాక ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కేసీఆర్‌ కలవనున్నారు. ముఖ్యమంత్రి వెంట ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు సంతోష్‌, రంజిత్‌ రెడ్డి, బి.బి. పాటిల్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, శ్రవణ్‌ కుమార్‌ ఉన్నారు. ముంబై పర్యటనలో భాగంగా కేంద్రంలోని బీజేపీ పై పోరాటం కొనసాగించేందుకు థాకరే, పవార్‌తో చర్చలు జరపనున్నారు. సీఎం కేసీఆర్‌ పర్యటన సందర్భంగా ముంబైలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘దేశ్‌ కీ నేత ‘అంటూ నినాదాలతో ..కేసీఆర్‌కు మద్దతిచ్చే ప్రాంతీయ పార్టీల అధినేతలు, సీఎంల ఫోటోలతో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.  ముంబై పర్యటన ముగిసిన తర్వాత కేసీఆర్‌ కర్ణాటక వెళ్లనున్నారని సమాచారం. అక్కడ మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ కానున్నారని సమాచారం.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/