యూపీలో విచిత్రమైన సంఘటన..లింగ మార్పిడి చేసుకొని పెళ్లి సిద్దమైన మహిళలు

wedding
wedding

ఉత్తరప్రదేశ్ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. లింగ మార్పిడి చేసుకొని ఇద్దరు యువతులు పెళ్లికి సిద్ధం కావడం వార్తల్లో హైలైట్ అవుతుంది. సమాజం వీరి పెళ్లికి అడ్డు చెపుతుందని భావించిన సదరు యువతులు..వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోర్ట్ ను ఆశ్రయించారు. ఇందుకోసం వారిలో ఒకరు లింగమార్పిడి చేసుకున్నారు. దానికి సంబంధిత ధ్రువపత్రంతో స్థానిక సబ్‌ డివిజినల్ కోర్టులో రిజిస్ట్రేషన్ వివాహానికి వీరు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఘటన బరేలీలో వెలుగులోకి వచ్చింది.

బరేలీకు చెందిన ఇద్దరు అమ్మాయిలు ఓ ప్రైవేట్ సంస్థ లో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరి మధ్య స్నేహం.. ప్రేమగా మారింది. వీరిలో ఒకరు బరేలికి చెందినవారు కాగా.. మరొకరు బదాయూ ప్రాంతానికి చెందినవారు. ప్రేమలో ఉన్న వీరు పెళ్లి చేసుకుని కలిసి బతకాలనుకున్నారు. కానీ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో వారు కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇద్దరిలో ఓకే అమ్మాయి లింగమార్పిడి చేయించుకుంది. చికిత్స అనంతరం ధ్రువపత్రంతో స్థానిక సబ్ డివిజినల్ కోర్టులో రిజిస్ట్రేషన్‌ వివాహానికి వీరు దరఖాస్తు చేసుకున్నారు. డిజిస్ట‍్రేషన్ ద్వారా వివాహానికి ప్రత్యేక వివాహ చట్టం కింద దరఖాస్తు పెట్టుకున్నారని బరేలీ ఎస్డీఎం ప్రత్యూష పాండే తెలిపారు.