శర్వానంద్ పెళ్లి రిసెప్షన్ లో చరణ్ – బాలకృష్ణ ల మధ్య ఆసక్తికర ఘటన

హీరో శర్వానంద్ పెళ్లి రిసెప్షన్ హైదరాబాద్ లో గత రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు సినీ , రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా ఈ రిసెప్షన్ వేడుకలో నందమూరి బాలకృష్ణ – చరణ్ ల మధ్య ఆసక్తికర సన్నివేశం జరిగింది.

శర్వాతో ఫోటో దిగిన తర్వాత చరణ్ కొద్ది సమయం సరదాగా ముచ్చటించాడు. అదే సమయంలో శర్మ మెడకు ఉన్న టై ని సర్ది అందరి దృష్టిని ఆకర్షించాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన నందమూరి బాలకృష్ణ ను చూసి వినమ్రంగా నమస్కరించడం జరిగింది. అప్పుడే బాలయ్య బాగున్నావా అని అడగడం కూడా జరిగింది.

బాలకృష్ణ బాగున్నావా అంటూ ప్రశ్నించడంతో బాగున్నాను అంటూ చరణ్ సమాధానం చెప్పాడు. అప్పుడే చరణ్ వీపుపై చిన్నగా కొట్టి బాలయ్య అక్కడ నుండి నవ్వుకుంటూ వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, ఇండస్ట్రీ స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో జూన్ 2 , 3 తేదీల్లో జరిగిన శర్వానంద్‌ పెళ్లి వేడుకకు టాలీవుడ్ యాక్టర్లు రాంచరణ్‌, సిద్దార్థ్‌, అదితీరావు హైదరీతోపాటు ఇతర నటీనటులు, సినీ ప్రముఖులు హాజరై.. వధూవరులను ఆశీర్వదించారు. శర్వానంద్‌ సతీమణి రక్షితారెడ్డి సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగిని.

YouTube video