ఫ్రాన్స్‌ ప్రథమ మహిళకు పోచంపల్లి ఇకత్‌ చీర బహుమతి

Telangana’s Pochampally Ikat is PM Modi’s gift to Brigitte Macron

పారిస్‌: ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఆ దేశ ప్రథమ మహిళకు చేతితో నేసిన పోచంపల్లి ఇకత్‌ చీరను బహూకరించారు. ప్రధాని మోడీ రెండు రోజుల ఫ్రాన్స్‌ పర్యటన నేటితో ముగిసింది. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇందులో భాగంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌కు గంధపు చెక్కతో తయారు చేసిన సగీత వాయిద్యం సితార్ ‌, సరస్వతి విగ్రహాలు, ఆయన సతీమణి బ్రిగిట్టే మాక్రాన్‌కు చందనం పెట్టెలో పోచంపల్లి ఇకత్‌ చీరను ప్రధాని మోడీ అందజేశారు.

అదేవిధంగా ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ యేల్ బ్రౌన్-పివెట్‌కు చేతితో అల్లిన పట్టు కశ్మీరీ కార్పెట్‌ను , ఫ్రెంచ్ సెనేట్ ప్రెసిడెంట్ గెరార్డ్ లార్చర్‌కు గంధపు చెక్కతో చెక్కిన ఏనుగు అంబారీని మోడీ బహూకరించారు. ఇక 20వ శతాబ్దంలో ఫ్రెంచ్ సాహిత్యంలోని ముఖ్యమైన నవలను మోడీకి మాక్రాన్ బహుమతిగా ఇచ్చారు.