నేడు మూడు చోట్ల రేవంత్‌రెడ్డి బహిరంగ సభలు

తెలంగాణ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో కాంగ్రెస్ పార్టీ మరింత స్పీడ్ అవుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో బస్సు యాత్ర చేపడుతూ వస్తున్నారు. ఈరోజు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు చోట్ల భారీ బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రేవంత్‌ రెడ్డి ప్రచారంలో పాల్గొననున్నారు. అలంపూర్‌, గద్వాల, మక్తల్‌ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు.

హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో అలంపూర్‌ వెళ్తారు. అక్కడ అలంపూర్‌లో జోగులాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆలంపూర్ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు గద్వాల బహిరంగసభలో రేవంత్ ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు మక్తల్ లో నిర్వహించనున్న సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు.

ఇదిలా ఉంటె సోమవారం రాత్రి కాంగ్రెస్ మూడో జాబితా అభ్యర్థులను ప్రకటించింది. 16 మంది తో కూడిన అభ్యర్థులను ప్రకటించగా..మరో నాల్గు స్థానాలకు సంబదించిన అభ్యర్థులను పెండింగ్ లో పెట్టింది. అలాగే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డి బరిలో..కేసీఆర్ ఫై పోటీ చేయబోతున్నారు. రేవంత్ ఇప్పటికే కొడంగల్ స్థానం నుంచి బరిలో ఉన్న సంగతి తెలిసిందే.

అలాగే వనపర్తి, బోథ్ స్థానాల్లో అభ్యర్థులను సైతం కాంగ్రెస్ అధిష్టానం మార్చారు. వనపర్తి నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత జీ చిన్నారెడ్డి స్థానంలో తుడి మేఘా రెడ్డి , ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి ఆదే గజేందర్ లను ఖరారు చేసింది. ఇంతకుముందు బోథ్ నుంచి వన్నెల అశోక్‌కు టికెట్ కేటాయించారు. ఇక మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి, చార్మినార్ స్థానాల అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టింది.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మూడో జాబితా చూస్తే ..

చెన్నూర్- డాక్టర్ జీ వివేక్
బోథ్-ఆదే గజేందర్
జుక్కల్ (ఎస్సీ) – తోట లక్ష్మీకాంతరావు
బాన్సువాడ -ఏనుగు రవీందర్ రెడ్డి
కామారెడ్డి – రేవంత్ రెడ్డి
నిజామాబాద్ అర్బన్- మహ్మద్ షబ్బీర్ అలీ
కరీంనగర్- పురుమళ్ల శ్రీనివాస్
సిరిసిల్ల – కేకే మహేందర్ రెడ్డి
నారాయణ్ ఖేడ్- సురేశ్ కుమార్ షెట్కార్,
పఠాన్ చెరు- నీలం మధు ముదిరాజ్
వనపర్తి- తుడి మేఘారెడ్డి
డోర్నకల్ (ఎస్టీ) -డాక్టర్ రామచంద్రు నాయక్,
ఇల్లందు (ఎస్టీ) – కోరం కనకయ్య,
వైరా (ఎస్టీ) – రాందాస్ మాలోత్,
సత్తుపల్లి (ఎస్సీ)- డాక్టర్ మట్ట రాగమయి,
అశ్వరావుపేట (ఎస్టీ) జారే ఆది నారాయణ.