ఛత్తీస్​గఢ్, మిజోరం లలో కొనసాగుతున్న పోలింగ్

ఛత్తీస్​గఢ్, మిజోరం రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్​ ప్రక్రియ ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు.. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఛత్తీస్​గఢ్​లోని 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. వీటిలో సమస్యాత్మక అంతగఢ్, భానుప్రతాపుర్, కంకేర్, కేష్‌కల్, కొండగావ్, నారాయణపుర్, దంతెవాడ, బీజాపూర్, కొంటా స్థానాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్​.. మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది. మరోవైపు మిగతా నియోజకవర్గాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు ఓటింగ్ జరుగుతుంది.

ఇక మిజోరం లో మొత్తం 40 స్థానాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. 174 మంది అభ్యర్థుల ఈ ఎన్నికల్లో తమ లక్ పరీక్షించుకుంటుండగా.. 8 లక్షలకు పైగా ఓటర్లు ఓటింగ్​లో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో పోలింగ్​కు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు చేపట్టింది.

ఓటింగ్​ కోసం 1276 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. 24 థోరంగ్​ (ఎస్​టీ) నియోజకవర్గం పరిధిలో థెలెప్​ పోలింగ్​ స్టేషన్​లో అత్యల్పంగా 26 మంది ఓటర్లే ఉన్నారు. ఐజ్వాల్​ ఈష్ట్​ (జెనరల్​) నియోకవర్గంలోని 24 జెమంబ్వాంక్​ పోలింగ్​ స్టేషన్​ పరిధిలో అత్యధికంగా 1481 మంది ఓటర్లు ఉన్నారు. ఇక రాష్ట్రంలోని 30 పోలింగ్​ కేంద్రాలను సున్నితమైన ప్రాంతాలుగా ప్రకటించారు.