నేడు చెన్నూరు, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు గులాబీ బాస్ , సీఎం కేసీఆర్ చెన్నూరు, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల్లో జరగబోయే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొనబోతున్నారు. గత కొద్దీ రోజులుగా వరుసగా పలు జిల్లాల పర్యటన చేస్తూ మరోసారి బిఆర్ఎస్ ను భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పదేళ్లలో బిఆర్ఎస్ ఎలాంటి సంక్షేమ పధకాలు తీసుకొచ్చిందో..ఆసరా పెన్షన్లు, రాష్ట్ర అభివృద్ధి తదితర విషయాలు ప్రజలకు గుర్తు చేస్తూ..కాంగ్రెస్ , బిజెపి పార్టీల ఫై నిప్పులు చెరుగుతూ పర్యటనను కొనసాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈరోజు సీఎం కేసీఆర్ చెన్నూరు, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి పాఠశాల మైదానంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను ప్రభుత్వ ఎమ్మెల్యే బాల్క సుమన్ పరిశీలించారు. పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న సభకు నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కోరారు.