జూన్‌ 1నుండి ప్యాసింజర్‌ రైళ్లు ప్రారంభం

త్వరలోనే రిజర్వేషన్లు ప్రారంభం.. వెల్లడించిన రైల్వే మంత్రి పీయుష్ గోయల్

train
train

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ 4లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలిపులతో చాలా రాష్ట్రాల్లో బస్సులు, కార్లు, ఆటోలు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. అయితే ఈనేపథ్యంలో జూన్ 1 నుంచి రైళ్లను నడపడానికి రైల్వే శాఖ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ మేరకు రైల్వే మంత్రి పీయుష్ గోయల్ ఓ ట్వీట్ చేశారు. జూన్ 1 నుంచి దేశమంతటా నిత్యమూ 200 నాన్ ఏసీ రైళ్లను టైమ్ టేబుల్ ప్రకారం నడిపించాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు. ఈ రైళ్లకు త్వరలోనే ఆన్ లైన్ రిజర్వేషన్ అందుబాటులోకి వస్తుందని కూడా అన్నారు. పీయుష్ గోయల్ ట్వీట్ ను చూసిన వారంతా ఈ నెల 31 తరువాత లాక్ డౌన్ ఇక దాదాపుగా తొలగిపోయినట్టేనని అంటున్నారు.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/