24న కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

ఒకే రోజులో మొత్తం 9 రైళ్లను ప్రారంభించనున్న మోడీ

Hyderabad-Bengaluru Vande Bharat Express launches on september 24

న్యూఢిల్లీః రైల్వే ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో ప్రారంభం కానుంది. హైదరాబాద్, బెంగళూరు మధ్య పరుగులు పెట్టే ఈ రైలును ప్రధాని మోడీ ఈ నెల 24న వర్చువల్‌గా పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. కాచిగూడ వేదికగా జరిగే ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొంటారు. మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు ఈ రైలు బయలుదేరి.. మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం మీదుగా మధ్యాహ్నం రెండు గంటలకు యశ్వంత్‌పూర్‌కు (బెంగళూరు) చేరుకుంటుంది. తిరిగి 2.45కు యశ్వంత్‌పూర్‌ నుంచి బయలుదేరి రాత్రి 11.45కు కాచిగూడ చేరుకుంటుంది.