ఏపీలో కేజీ టమాటా రూ.50

దేశ వ్యాప్తంగా టమాటా ధర భగ్గుమంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా టమాటా ధర కొండెక్కి కూర్చుంది. ప్రస్తుతం కేజీ టమాటా రూ. 200 నుండి రూ. 250 పలుకుతుండగా..ఏపీలో మాత్రం కేజీ టమాటా రూ. 50 లే పలుకుతుంది. గత రెండు నెలలుగా టమాటా ధర తగ్గేదెలా అంటుంటుంది. దీంతో సామాన్య ప్రజలు టమాటా వైపు చూసేందుకు కూడా భయపడుతున్నారు.

మరికొంతమంది మాత్రం కేజీ తీసుకునే దగ్గర పావుకేజీ తీసుకుని వెళ్తున్నారు. ఈ తరుణంలో ఏపీలోని కర్నూలు జిల్లాలో టమాట ధర దిగివచ్చింది. ఆ జిల్లాలోని రైతు బజారులో కిలో టమాట రూ.50 నుంచి రూ.80 మధ్య నడుస్తోంది. స్థానిక పంట మార్కెట్ కు రావడంతో ధర తగ్గింది. కడప జిల్లాలో సాగయిన టమాట పంట మార్కెట్ కు తెస్తున్నారు రైతులు. దీంతో టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి. మరోపక్క ఏపీ సర్కార్ సైతం గత కొద్దీ రోజులుగా టమాటా ను సబ్సిడీ రూపంలో అందిస్తుంది.