ఈ నెల 10న టీటీడీ ఛైర్మన్‌ గా బాధ్యతలు స్వీకరించనున్న భూమన

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నూతన ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌ రెడ్డిని సీఎం జగన్ నియమించిన సంగతి తెలిసిందే. గతంలో కూడా భూమన టీటీడీ ఛైర్మన్ గా పనిచేశారు. మరోసారి ఆ అవకాశం భూమన కు దక్కింది. టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్‌ రెడ్డి రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ నెల 10 న TTD నూతన పాలకమండలి చైర్మన్ గా భూమన భాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక ఈరోజు తిరుమల టిటిడి పాలకమండలి సమావేశం జరుగనుంది. రేపటితో ప్రస్తుత టీటీడీ పాలకమండలి గడువు ముగియనుంది.

ఇక అటు.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేసి ఉండగా… టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 83,856 మంది భక్తులు దర్శించుకోగా… 28,403 మంది భక్తులు తరనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.09 కోట్లు చేరింది.