మహబూబాబాద్ జిల్లాలో టొమాటోలు దొంగతనం

ప్రస్తుతం మార్కెట్ లో టమాటో ధర ఏ రేంజ్ లో ఉందొ చెప్పాల్సిన పనిలేదు. కేజీ రూ. 20 , రూ. 10 లకు దొరికే టమాటో ఇప్పుడు కేజీ రూ. 120 నుండి 150 పలుకుతుంది. అంతే కాదు పచ్చి మిర్చి సైతం దాదాపు కేజీ రూ.150 పలుకుతుంది. దీంతో వీటిని కొనాలంటే సామాన్య ప్రజలు వణికిపోతున్నారు. ఇదే అదును చేసుకున్న దొంగలు వీటిని దొంగతనం చేయడం మొదలుపెట్టారు.

తాజాగా మహబూబాబాద్ జిల్లాలో టమాటో, పచ్చి మిర్చిల బాక్స్ లను ఎత్తుకెళ్లారు. జిల్లాలోని డోర్నకల్ లో మూడు రోజులుగా రాత్రి సమయంలో టమాటా బాక్సులు చోరీ అవుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు టమాటా, పచ్చిమిర్చి బాక్సులను ఎత్తుకెళ్తున్నారు. టమాటా బాక్సులు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. టాటా ఏస్ వాహనంలో నుంచి టమాటా, పచ్చిమిర్చి బాక్సులు గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్తునట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు. ఈ విషయం పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేయడం తో పోలీసులు రంగంలోకి దిగారు. టమాటా దొంగలను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.