ఈసారి ప‌దో త‌ర‌గ‌తి లో ఆరు పేపర్లే: విద్యాశాఖ ఉత్త‌ర్వులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. 2021-22 విద్యా సంవ‌త్స‌రానికి గానూ.. 11 పేప‌ర్ల‌కు బ‌దులుగా ఆరు పేప‌ర్ల‌తోనే ప‌రీక్షలు నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఒక్కో స‌బ్జెక్టుకు ఒక్కో పేప‌రే ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

అయితే ఈ ఏడాదికి గానూ ఉర్దూను సెకండ్ ల్యాంగ్వేజ్‌ను ప‌రిగ‌ణిస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఈ మేర‌కు ప‌ది ప‌రీక్ష‌ల విధానంపై విద్యాశాఖ కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్త‌ర్వులు జారీ చేశారు. వ‌చ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హించే అవ‌కాశం ఉంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/