పోర్న్ స్టార్ తో వర్మ..

సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏంచేసినా అది వైరల్ కావాల్సిందే. కొత్త సినిమా ప్రకటించిన..రిలీజ్ చేసిన..ఓ హీరోయిన్ తో ఇంటర్వ్యూ చేసిన ..ఇలా ఏంచేసినా సరే క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈయన పోర్న్ స్టార్ తో సెల్ఫీ దిగి..ఆ పిక్స్ ను సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి.

ప్రస్తుతం వర్మ అమెరికా లో ఉన్నాడు. అమెరికాలో తెలుగువాళ్ళకు సంబంధించిన ఓ ఈవెంట్ లో పాల్గొనడానికి వర్మ యూస్ కు వెళ్ళాడు. అక్కడ పోర్న్ స్టార్ మియా మాల్కోవా తో సెల్ఫీ లు దిగి వాటిని సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. గతంలో మియా మాల్కోవాతో GST అనే ఓ బోల్డ్ షార్ట్ ఫిలిం కూడా తీశాడు వర్మ. ఆ సినిమాతోనే వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది. అప్పట్లో ఆర్జీవీ మియా మేల్కొవాతో తీసిన GST ఓ సంచలనంగా మారింది. పలువురు విమర్శించినా కూడా ఆ ఫిలిం చూసి అభినందించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆర్జీవీ ఇప్పుడు అమెరికాకు వెళ్లడంతో మరోసారి మియా మాల్కోవాని కలిశాడు. ప్రస్తుతం వీరు దిగిన పిక్స్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది.