టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. 2018లో నమోదైన డ్రగ్స్ కేసులకు సంబంధించి నాంపల్లి కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. టాలీవుడ్‌ నటులపై నమోదయిన 8 కేసుల్లో 6 కేసులను కోర్టు కొట్టివేసింది. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుపై గత ప్రభుత్వం ప్రత్యేక సిట్‌ ఏర్పాటు చేసింది. టాలీవుడ్ డ్రగ్స్‌పై మొత్తం 8 కేసులను సిట్ నమోదు చేసింది. అయితే 8 కేసుల్లో ఆరు కేసులను కోర్టు కొట్టివేసింది.

సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేకపోవడంతో ఈ కేసులను నాంపల్లి కోర్టు తోసిపుచ్చింది. నటీనటుల నుంచి గోళ్లు, వెంట్రుకల నమూనాలను తీసుకున్న సిట్.. ఈ శాంపిల్స్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించింది. ఈ క్రమంలో పూరీ జగన్నాథ్‌, తరుణ్‌ శాంపిల్స్‌ను పరిశీలించిన ఎఫ్‌ఎస్‌ఎల్‌.. వాళ్ల శరీరంలో ఎలాంటి డ్రగ్స్‌ ఆనవాళ్లు లభించలేదని తేల్చింది. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక, సాక్ష్యాలు చూసి 6 కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.