బిఆర్ఎస్ నేతలకు కీలక సూచనలు తెలియజేసిన కేసీఆర్

బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్..ఈరోజు గజ్వేల్ ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేసారు. అనంతరం పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భాంగా వారికీ కీలక సూచనలు తెలియజేసారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణ గురించి పార్టీ నేతలకు అధినేత దిశానిర్దేశం చేశారు.

అలాగే త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణ సంబంధిత అంశాల గురించి చర్చించి పలు సూచనలు చేశారు. దేశానికి ఆదర్శంగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీ మాత్రమే రాజీ లేని పోరాటాలతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందని పునరుద్ఘాటించారు. తెలంగాణను సాధించి, స్వరాష్ట్రాన్ని పదేండ్ల అనతికాలంలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి పథంలో నడిపించామని కేసీఆర్‌ అన్నారు