ఏపీ ప్రభుత్వం లోకేష్ విమర్శలు

ప‌క్క‌ రాష్ట్ర పాల‌కులు అధ్వాన పాల‌న‌కి ఉదాహ‌ర‌ణ‌గా ఏపీని చూపిస్తున్నారు..


అమరావతి: ఏపీ ప్రభుత్వం పై నారా లోకేష్ మరోసారి విమర్శలు చేసారు. రాష్ట్రంలో రోడ్లు న‌డిచేందుకు కూడా వీలుగా లేదని జ‌నం గ‌గ్గోలు పెడుతున్నారని లోకేష్ పేర్కొన్నారు. ప‌క్క‌ రాష్ట్ర పాల‌కులు అధ్వాన పాల‌న‌కి ఉదాహ‌ర‌ణ‌గా మ‌న ఏపీని చూపిస్తున్నారన్నారు. అయినా ప్ర‌భుత్వ స్పంద‌న శూన్యమన్నారు.

రాజ‌కీయాల‌కు దూరంగా, ఆధ్మాత్మిక ప్ర‌పంచానికి ద‌గ్గ‌ర‌గా, హిందూ ధ‌ర్మ ప్ర‌చార‌మే జీవిత‌ ల‌క్ష్యంగా సాగుతోన్న చిన‌ జీయ‌ర్ స్వామి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ర‌హ‌దారుల దుస్థితిపై ఆవేద‌న‌తో స్పందించారని నారా లోకేష్ పేర్కొన్నారు. గ‌తుకులు-గుంత‌లు, ఒడిదుడుకుల గురించి ప్ర‌స్తావిస్తూనే.. జంగారెడ్డి గూడెం నుంచి రాజ‌మ‌హేంద్ర‌వ‌రం వ‌ర‌కూ రోడ్డు ప్ర‌యాణం ఒక జ్ఞాప‌కంగా మిగిలిపోనుంద‌ని రోడ్ల దుస్థితిని భ‌క్తుల‌కు చెబుతున్న‌ట్టే ప్ర‌వ‌చ‌నంలో భాగంగానే వ్యాఖ్యానించ‌డం చూస్తుంటే.. జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో ర‌హ‌దారులు ఎంత దారుణంగా ఉన్నాయో స్ప‌ష్టం అవుతోందని నారా లోకేష్ పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/