లోకేష్ పాదయాత్ర కు పోలీసులు గ్రీన్ సిగ్నల్ …కానీ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27 నుండి యువగళం పేరుతో పాదయాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. నిన్నటి వరకు లోకేష్ పాదయాత్ర కు పోలీసులు అనుమతి ఇస్తారా లేదా అనే సందేహాలు నెలకొని ఉన్నాయి. అయితే ఇక ఇప్పుడు ఆ సందేహాలకు చెక్ పడింది. పోలీసులు లోకేష్ పాదయాత్ర కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాకపోతే బహిరంగ సభల సమయాలకు కట్టుబడి ఉండాలని సూచించారు.

రోడ్లపై ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు. డ్యూటీలో ఉన్న పోలీసులు ఎప్పటికప్పుడు ఇచ్చే ఆదేశాలను పాటించాలని.. భద్రతల నిర్వహణలో, ట్రాఫిక్ నియంత్రణలో సహకరించాలన్నారు. ఇక ఈ నెల 25న లోకేష్ హైదరాబాద్‌‌లో తన నివాసం నుంచి బయలుదేరి ఎన్టీఆర్‌ ఘాట్‌ చేరుకుంటారు. అక్కడే దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి బయల్దేరి కడపకు వెళతారు.. అక్కడ పెద్ద దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం మరియాపురంలోని కేథలిక్‌ చర్చిని సందర్శించి ప్రార్థనల్లో పాల్గొంటారు. జనవరి 27 న కుప్పం నుండి పాదయాత్ర మొదలుపెడతారు. రోజుకు 10 కిలోమీటర్ల చొప్పున 400 రోజులపాటు 4వేల కిలోమీటర్లు నడవబోతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో యాత్ర ముగుస్తుంది. ఈ యాత్రలో దాదాపు రాష్ట్రంలోని ముఖ్యమైన నియోజకవర్గాన్నింటినీ కవర్ చేయనున్నారు.