వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. టోల్ ఛార్జీలు పెంపు

దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు సగటున 5% పెరిగాయి. నిన్న అర్ధరాత్రి నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. ఏటా APR 1న NHAI టోల్ ఛార్జీలు పెంచుతుంది. ఈసారి ఎన్నికలు ఉండటంతో EC ఆదేశాలతో వాయిదా వేసింది.

నిన్నటి తో లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో నేటి అర్థరాత్రి నుంచి ఈ రుసుములను పెంచుతూ నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. సగటున ఐదు శాతం టోల్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అన్ని జాతీయ రహదారులపై నేటి నుంచి టోల్ ఛార్జీలు పెరగనున్నాయి. రహదారుల మరమ్మతులు, నిర్వహణ కోసం ఏటా టోల్ ఛార్జీలను ఎన్‌హెచ్ఏఐ పెంచుతూ వస్తుంది.

హైదరాబాద్-విజయవాడ హైవేపై కార్లు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి రూ.5, రెండు వైపులా కలిపి రూ.10 పెరిగింది. తేలికపాటి వాణిజ్య వాహనాలు రూ.10-20, బస్సులు, ట్రక్కులు రూ.25-35, భారీ రవాణా వాహనాలకు రూ.35-50కి పెరిగాయి.