‘పోస్టల్ బ్యాలెట్’పై సుప్రీంకోర్టుకు వెళ్తాం – సజ్జల

పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈసీ నిర్ణయం అనైతికమని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓట్ల లెక్కింపుపై ఈసీ గత ఏడాది స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చిందని గుర్తు చేశారు. ‘పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్లో అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, సీలు కచ్చితంగా ఉండాలి. సీలు లేకుంటే హోదా వివరాలుండాలని చెప్పారు. పోలింగ్ అయ్యాక అవి అవసరం లేదనడం సరికాదు’ అని పేర్కొన్నారు.

అలాగే నిన్న విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫై కూడా స్పందించారు. ట్రెండ్స్ అన్నీ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని సజ్జల చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కంటే బెటర్‌గా జూన్ 4న ఫలితాలు ఉంటాయని అన్నారు. సీరియస్‌గా చేసిన సర్వేలు తమకు అనుకూలంగా వచ్చాయని చెప్పారు. టీడీపీకి అనుకూలంగా చెబుతున్న సంస్థలు అంత సీరియస్‌గా సర్వేలు చేసినవి కాదని అన్నారు. సర్వేలు ఎలా చేశారనేది కూడా చూడాలని, ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు చూడాలని సజ్జల తెలిపారు. సీరియస్‌గా చేసిన సర్వేలు తమకు ఎందుకు అనుకూలంగా ఇచ్చారో చెప్పాయని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ లో సుప్రీంకోర్టుకు వెళ్తున్నామని తెలిపారు. గెజిటెడ్ అధికారి సంతకం ఉండాలని దేశ వ్యాప్తంగా నిబంధనలు ఉన్నాయని తెలిపారు.