పొత్తులపై స్సందించిన రేవంత్ రెడ్డి

తాను పీసీసీ అధ్యక్షునిగా ఉన్నంతకాలం బిఆర్ఎస్ తో పొత్తు ఉండదు..

cbi-ed-did-not-give-appointment-to-tpcc-chief-revanth-reddy

హైదరాబాద్‌ః పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పీసీసీ అధ్యక్షునిగా ఉన్నంతకాలం బిఆర్ఎస్ తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. సిఎం కెసిఆర్‎ది దృతరాష్ట్రుని కౌగిలి అని..అందులో తాము బందీ కాదల్చుకోలేమని తేల్చి చెప్పారు. కెసిఆర్ చేసిన ద్రోహాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నడటికి క్షమించదని పేర్కొన్నారు. తమ పార్టీలో ఎవరైన బిఆర్ఎస్ తో కలిసి వెళదామంటే వారిని ఉపేక్షించేది లేదని తెలిపారు. బిజెపితో కొట్లాడి కాంగ్రెన్ ను చంపే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తాత్కాలిక అవసరాలకై మాఫియా పార్టీ అయిన బిఆర్ఎస్ తో కలిసేది లేదని పేర్కొన్నారు.

రానున్న ఎన్నికల్లో కెసిఆర్ ను ఓడించేవాళ్లకే జనం ఓటేస్తారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో ఇదే లెక్కతో జనం ఓటేశారని పేర్కొన్నారు. ఎన్నికల్లో రెండు పార్టీల మధ్యే పోటీ ఉంటుందని..అందులో కాంగ్రెస్ ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలు కెసిఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ను 80 సీట్లతో గెలిపించడానికి జనాలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.