నేడు అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ చివరి రోజు

ఏపీ శాసనసభలో నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చివరి సమావేశం జరగనుంది. 2024- 25 బడ్జెట్పై ప్రభుత్వం చర్చ చేపట్టనుంది. వివిధ శాఖల యాన్యువల్ నివేదికలు సభ ముందు ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్లోని అంశాలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రసంగించనున్నారు.

అయితే చివరి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. కోరం లేని కారణంగా సమయానికి అసెంబ్లీ ప్రారంభం కాని పరిస్థితి. సభా సమయానికి ప్రారంభం కాలేదని టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. కోరం లేకపోవడం ఘోరం అంటూ అసెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యేల కామెంట్లు చేశారు.

గురువారం ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైన వెంటనే ముందుగా స్పీకర్ తమ్మినేని సీతారాంకు (Speaker Tammineni Seetharam) టీడీపీ , వైసీపీ ఎమ్మెల్యేలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆపై జాబ్ క్యాలెండర్‌పై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. వాయిదా తీర్మానంపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోదయం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. దీంతో సభళో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లుకు సవరణలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రతిపాదించారు.