తండ్రి తెచ్చిన మండలిని కొడుకు రద్దు చేస్తున్నారు

రాష్ట్రపతి ఆర్డర్ వచ్చే వరకూ మండలి కొనసాగుతుంది

MLC Madhav
MLC Madhav

అమరావతి: ఏపిలో శాసనమండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టడంపై అటు టిడిపి, ఇటు బిజెపి పార్టీల నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తండ్రి శాసనమండలిని ఏర్పాటుచేస్తే.. కుమారుడు జగన్ దాన్ని రద్దు చేస్తున్నారని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెచ్చిన మండలిని తనయుడు జగన్ రద్దు చేయడం దురదృష్టకరమన్నారు.శాసన మండలి రద్దు విషయంలో.. వైఎస్‌ఆర్‌సిపి , టిడిపి పార్టీలు దోషులేనని ఆయన వ్యాఖ్యానించారు. రద్దు విషయంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేదన్నారు. మండలి రద్దుకు కొంచెం సమయం పడుతుండొచ్చన్నారు. దీనిపై న్యాయపోరాటం చేసే అవకాశముందన్నారు. రాష్ట్రపతి ఆర్డర్ వచ్చే వరకూ మండలి కొనసాగుతుందన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/