కళ్ల అలసట పోవాలంటే

నేత్రాలు- పరిరక్షణ

To relieve eye fatigue
To relieve eye fatigue

ఎక్కువ సమయం ఫోన్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ స్క్రీన్‌ వంక చూడడం వల్ల కళ్ల మీద ఒత్తిడి ఎక్కువవుతుంది. దాంతో దురదతో పాటు కళ్లు మంటపుడతాయి.

కళ్ల నుంచి నీరు కారుతుంది. అలాంటప్పుడు రోజ్‌వాటర్‌ ఉపయోగిస్తే కళ్లు తాజాగా ఉంటాయి. కొద్దిగా రోజ్‌వాటర్‌ను కాటన్‌ బాల్‌ మీద చల్లాలి. కళ్లు మూసుకుని కాటన్‌ బాల్స్‌ను 15 నిమిషాల పాటు కళ్లమీద ఉంచాలి. ఇలా చేస్తే కళ్ల అలసట తీరుతుంది.

అంతేకాదు రోజ్‌వాటర్‌లోని గుణాలు నొప్పిని తగ్గిస్తాయి. మెదడు కణానలు ఉత్తేజితం చేస్తాయ. కళ్లు ఎరుపెక్కినపుడు ఇంట్లో రెండు చుక్కల రోజ్‌వాటర్‌ వేయాలి.

20 నిమిషాల పాటు కళ్లు మూసుకుని ఉంటే కళ్ల ఎరుపు తగ్గుతుంది.

అలాగే కంట్లోని మలినాలు, దుమ్ముధూళిని వదిలించుకునేందుకు కూడా రోజ్‌వాటర్‌ పనికొస్తుంది. కళ్ల కింద రోజ్‌వాటర్‌ రుద్దుకుంటే కళ్ల వాపు, కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గిపోతాయి.

రోజ్‌వాటర్‌ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆయుర్వేదంలో రోజ్‌వాటర్‌ను దురద, మంటపుట్టడం వంటి సమస్యలకు ఔషధంగా వాడతారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/