వెంటాడుతున్న కరోనా భయం

‘మనస్విని’ మానసిక సమస్యలకు పరిష్కారవేదిక

Manaswini
Manaswini

నమస్తే మేడమ్‌! నా పేరు లక్ష్మి, వయసు 55 సంవత్సరాలు. నాకు ఇద్దరు పిల్లలు. అంతా బాగుంది కానీ, నాలో ఏదో భయం, ఆందోళన. నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. మా పిల్లలు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోయారు.

నేనొక్కదాన్నే ఈ లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో ఉండటంతో ఒంటరిగా ఫీలవ్ఞతున్నాను. నా భర్త వేరే ఊర్లో ఉంటారు. ఒక్కోసారి ఎంతో భయంతో ఉంటున్నాను. కరోనా వస్తుందేమో అని, నా పిల్లలకు ఏమైపోతుందో అని భయంగా, కుంగుబాటుతో ఉంటున్నాను.

నేను ఏంచేస్తే మరల తిరిగి భయం లేకుండా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలను? కొంచెం వివరించండి. లక్ష్మి, విజయవాడ

మీరు ముందుగా అస్సలు భయపడకూడదు. మీరు మీ ఒంటరితనం అనే ఆలోచనలు మానుకోండి. సానుకూలంగా ఆలోచించండి. వ్యతిరేక ఆలోచనలకు స్వస్తి చెప్పండి. ఇంతకుముందులాగే ఆనందంగా ఉండవచ్చు. ఎన్నో రకాల హాబీల ద్వారా చక్కగా ఆనందంగా ఉండవచ్చు. మీ సమయం మీది. మీరు ఎంతో స్వతంత్రంగా బతకవచ్చు. మీరు ఒంటరి ఎప్పటికీ కారు. అందరూ మీకు సహాయం చేస్తారు.

మీరు ఇంట్లో నుండి రోడ్డుమీదకి వస్తే ఎంతోమంది ఉంటారు. మనం ఎంతోమంది సహాయం వల్ల మనం జీవించగలుగుతున్నాము. వ్యాపారాలు, ఉపాధ్యాయుల, ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, ఇలా అనేకమంది సేవలతో మనం మనుగడ సాగించగలుతున్నాం. మన వివేకమే మనకు రక్ష. మన అవగాహనే మనకు రక్ష. మన స్పష్టమైన ఆలోచనలే మనకు రక్ష.

అందువల్ల మీరు తెలివిగా వ్యవహరిస్తే, ఎంతో ఆనందంగా ఉండగలరు. ఎంతోమంది మీకు సహాయం చేస్తారు. మన నాగరిక ప్రపంచంలో ఎంతోమంది మనతో మంచిగా, స్నేహంగా ఉంటారు. మనం కూడా వారికి చేతనైనంత సాయం చేయాలి.

నోరు మంచిదైతే, ఊరు మంచిదవ్ఞతుంది అని అంటారు. అది అక్షరాలా నిజం. అందువల్ల మీరు మీ జీవితం విలువను గ్రహించి, ఎంతో ఆనందంగా ఉండండి. ఒంటరితనం అనేది మీ అపోహమాత్రమే. మీరు స్నేహం ప్రేమ అందించండి. అందరూ మీతో స్నేహంగా, ప్రేమగా ఉంటారు. మీకు మీరే మార్గదర్శకులు.

జీవితమంటే విరక్తి కలుగుతోంది

మస్తే మేడమ్‌! నా పేరు పద్మిని, వయసు 45 సంవత్సరాలు. మాకు ఒక అమ్మాయి పెళ్లైపోయింది. నేను, నా భర్త మా అత్తగారు ఉంటాం. అంతా నిస్పృహగా ఉంటోంది. ఒక్క ఆనందం లేదు. ఒక్క సరదాలేదు. ఎప్పుడూ వండుకోవడం, తినడం. ర

ోజూ ఎంతో బోర్‌గా ఉంటోంది. దైనందిన జీవితం ఏమీ బాగాలేదు. జీవితం అంటే విరక్తి పుడుతోంది. ఆనందం లేని జీవితం ఎందుకు? అనిపిస్తోంది. నాకిష్టమైన పనులు చేసుకుంటే, నా భర్త, అత్తగారు అడ్డుపడతారు. నాకు స్వేచ్ఛ లేదు. ఒకమృగంలాగా బతుకుతున్నాను. ఎందుకు ఈ జీవితం అనిపిస్తోంది. ఏం చేస్తే నేను మళ్లీ ఆనందంగా ఉండగలను? కొంచెం వివరించండి. పద్మిని, వరంగల్‌

మీరు తప్పక మరలా తిరిగి ఇంతకుముందుగా ఉన్నట్లు ఆనందంగా ఉండగలరు. ఇందులో సందేహం లేదు. ముందుగా మీరు జీవితాన్ని ఎలా ఆనందించాలి అనే విషయమై ఆలోచించండి.

సానుకూల ఆలోచనలతో ఎన్నో పరిష్కారమార్గాలు కనబడతాయి. మీలో ఎంతో శక్తి ఉంది.

మీలో ఎన్నో రకాల సామర్థ్యాలున్నాయి. మీరే మీకు గురువ్ఞ. జీవితం విలువను తెలుసుకోండి. ప్రతినిత్యం ఎంతో అమూల్యమైనది. మీరు ఎంతో గొప్ప వ్యక్తి. మీ గురించి మీకు తెలియాలి.

మీకున్న మంచి గుణాలు మీకు తెలియాలి. మీలో ఉన్న ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని వెలికితీయండి.

మీలో ఎంతో సాహనం కూడా ఉంది. దానిని బహిర్గతం చేసుకొని, జీవితాన్ని ఆనందంగా, ప్రశాంతంగా మలచుకోండి. ప్రశాంతత అనేది అవసరం. కోరిక కాదు. ప

్రశాంతత లేకపోతే, జీవితం అస్తవ్యస్తంగా అయిపోతుంది.

అందువల్ల జీవితంలో ప్రశాంతత ప్రాముఖ్యాన్ని గుర్తించి, దానిని పొందండి. అన్ని మీలోనే ఉన్నాయి. మీరు జ్ఞానాన్ని సముపార్జించుకొని, ప్రశాంతంగా జీవితాన్ని గడపండి.

అప్పుడు మీరు మీకుటుంబాన్ని కూడా బాగా ప్రేమించగలరు. వారికి ఆదర్శంగా ఉండగలరు. ప్రేమని, ఆనందాన్ని మీరు మీ కుటుంబ సభ్యులకు పంచండి.

అది తప్పకు మీకు తిరిగి చేరుతుంది. ఎంత పంచితే, అంత మీకు తిరిగి లభిస్తుంది. ఇందులో సందేహం లేదు.

  • డాక్టర్‌ ఎం. శారద, సైకాలజీ ప్రొఫెసర్‌

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/