చనా మసాలా కర్రీ

రుచి: వెరైటీ వంటకాలు ‘చెలి’ పాఠకుల కోసం

Chana masala curry
Chana masala curry

కావలసిన పదార్థాలు

కాబూటీ సెనగలు – ఒక కప్పు, ఉల్లిపాక – ఒకటి, పచ్చిమిర్చి – రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు – ఒక టీ స్పూన్‌, జీలకర్ర – ఒక టీస్పూన్‌, ధనియాలు – ఒక టీస్పూన్‌, మిరియాలు – ఒక టీస్పూన్‌,

ఎండుమిర్చి – నాలుగైదు, బిర్యానీ ఆకు – ఒకటి, దాల్చిన చెక్క – కొద్దిగా, లవంగాలు – నాలుగైదు, యాలకులు – రెండు, ఉప్పు, కారం – రుచికి తగినంత, నూనె – సరిపడా, పసుపు – చిటికెడు, టమోట పేస్టు – అరకప్పు, కొత్తిమీర – కొద్దిగా

తయారు చేసే విధానం

ముందుగా సెనగలను నాలుగైదు గంటలపాటు నానబెట్టాలి. తరువాత కొద్దిగా ఉప్పు వేసి కాబూలీ సెనగలను ఉడికించి పెట్టుకోవాలి.

ఒక టేబుల్‌ స్పూన్‌ సెనలను పేస్టుగా చేయాలి. మసాలి కోసం స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి, కాస్త వేడి అయ్యాక ఎండుమిర్చి, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, బిర్యానీ ఆకు వేసి కాసేపు వేగించాలి. తరువాత వాటిని మిక్సీలో వేసి పట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేయాలి. నూనె వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి.

కాసేపు వేగిన తరువాత టమోటా పేస్టు, సరిపడ ఉప్పు, కారం, పసుపు వేసి కలియబెట్టాలి. కాసేపయ్యాక ఉడికించి పెట్టుకున్న సెనగలు వేయాలి.

సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పొడి, సెనగల పేస్టు వేసి కలపాలి. గ్రేవీ కోసం కొద్దిగా నీళ్లు పోయాలి.

మూత పెట్టి అయిదు నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేయాలి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/