పారిజాత పుష్పాలు
పువ్వుల విశిష్టత

అయోధ్య భూమిపూజలో పాల్గొనే ముందు ప్రధాన మంత్రి పారిజాత మొక్కను ఆలయ ఆవరణలో నాటారు.
ప్రపంచంలో ఎన్నో మొక్కలు ఉండగా పారిజాత మొక్కనే ఎందుకు నాటారన్నది ఆసక్తికర అంశం.
తాళపత్ర గ్రంథాల్లో, పురాణాల్లో పారిజాత వృక్ష పవిత్రమైన, ప్రత్యేకమైన వృక్షంగా భావించేవారు.
ఈ చెట్టు పూలు సువాసన వెదజల్లుతాయి. ఈ చెట్టుకి ఔషధ గుణాలు ఎక్కువే. చాలా రకాల వ్యాధుల్ని నయం చేస్తుందంటారు.
ఈ చెట్టును హర్సింగర్ అని కూడా అంటారు. ఉర్దూలో దీన్ని గుల్జాఫరీ అంటారు. అందమైన పారిజా వృక్షం నుంచి పూల సువాసనలు చుట్టపక్కల అంతటా వ్యాపిస్తాయి.
ఈ చెట్టు ఆకులు, బెరడును కూడా వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. ఈ చెట్టును ముట్టుకుంటే అలసట తీరిపోతుందని కూడా అంటారు.
ఈ చెట్టులోని ఔషధ గుణాల వల్ల పైల్స్ సమస్య తీరుతుంది. గుండెకు కూడా ఈ పూలు మేలు చేస్తాయి.
ఈ పూలను గ్రైండ్ చేసి ఆ గుజ్జులో తేనె కలిపి తాగితే పొడి దగ్గు తగ్గుతుంది.
పూలను గుజ్జుగా చేసి చర్మంపై రాసుకుంటే చర్మరోగాలు నయమవుతాయి.
పారిజాత పూలతో హెర్బల్ ఆయిల్ కూడా తయారు చేస్తారు. పారిజాత ఆకుల రసం జ్వరాన్ని తగ్గిస్తుంది.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/