అందంగా కన్పించాలంటే …

బ్యూటీ టిప్స్.. మహిళలకు ప్రత్యేకం

Beauty Tips
Beauty Tips

ఆడపిల్లకీ ..అందానికీ అవినాభావ సంబంధం ఉంది.. గృహిణుల దగ్గర నుంచీ డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తల వరకూ అందరూ ఆకర్షణీయంగా కనిపించాలనుకుంటారు. అయితే , ప్రత్యేక మేకప్ లేకుండానే సౌందర్య రాశిలా కన్పించ వచ్చు.. ఎలాగంటారా.. ? ఈ చిన్న సూత్రాలు పాటిస్తే చాలు…

పరగడుపున గ్లాసు నీళ్లతో మొదలుపెట్టి.. రోజంతా 8 గ్లాసుల నీళ్లు తాగండి.. దీనివల్ల సగం ఆరోగ్యం మీ సొంతమైనట్టే . ఆరోగ్యం ఉందంటే అందం ఉన్నట్టే . చర్మం పొడిబారదు.. ముఖంలో కాంతి వస్తుంది..

కాఫీ, టీలు వీలైనంత తగ్గించండి.. బదులుగా గోరువెచ్చటి నీళ్లలో కొన్ని సబ్జా గింజలు , చెంచా తేనె వేసుకుని తాగండి.. ఫలితాన్ని చూడండి..

వీలైతే సాయంత్రంలో స్నానం చేయండి.. కుదరక పొతే ముఖం వరాలూ చల్లటి నీళ్లతో కడుక్కోండి.. సూక్ష్మక్రిములన్నీ తలగిపోయి ముఖం తేటగా , చూడముచ్చటగా ఉంటుంది..

రోజూ స్నానం చేసినా, చర్మం మీద మృతకణాలు కొన్ని మిగిలే ఉంటాయి. వాటివల్ల ఛాయ తక్కువగా కన్పిస్తుంది.. ఒకేరకంగా లేకుండా, షేడ్స్ వస్తాయి. తేటదనం ఉండదు.. ఇవన్నీ పోవాలంటే వారానికోసారి సున్ని పిండితో నాలుగు పెట్టుకోండి..

బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ తప్పక రాయండి.. చర్మం సురక్షితంగా ఉంటుంది.. పరోక్షంగా అందానికి కారణమవుతుంది/

‘నాడి’ (ఆరోగ్య విషయాలు) వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/