శ్రీకాకుళం జిల్లాలో రైలు ప్ర‌మాదం..ఐదుగురి మృతి

శ్రీకాకుళం : శ్రీ‌కాకుళం జిల్లాలో రైలు ప్ర‌మాదం జ‌రిగింది. జిల్లాలోని జి.సిగడాం వద్ద బాతువ గ్రామం సమీపంలో గతరాత్రి కోయంబత్తూరు-సిల్చార్ ఎక్స్ ప్రెస్ రైలు నిలిచిపోయింది. జనరల్ బోగీలో పొగలు రావడంతో ప్రయాణికులు అత్యవసర చెయిన్ లాగారు. రైలు ఆగడంతో ప్రయాణికులు కిందికి దిగారు. కొందరు అవతలివైపు ఉన్న పట్టాలు దాటే క్రమంలో, అదే సమయంలో దూసుకొచ్చిన కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలును గమనించలేదు. దాంతో రైలు పట్టాలు దాటుతున్న వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. కాగా, మరణించినవారు అసోంకు చెందినవారిగా గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/