తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ తో పాటు ఏపీలో జరిగిన రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, మూడు పట్టభద్రుల, మూడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కౌంటింగ్ కొనసాగుతుంది. తెలంగాణ కు సంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ హైదరాబాద్ సరూర్ నగర లోని ఇండోర్ స్టేడియంలో జరుగుతోంది. స్టేడియం చుట్టూ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మొత్తం 28 టేబుళ్లలో అధికారులు ఓట్లను లెక్కిస్తున్నారు.

ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు స్వర్ణభారతి స్టేడియంలో కొనసాగుతుంది. ఆరు జిల్లాల పరిధిలో మొత్తం 2,89,214 మంది ఓటర్లకు గాను 2,00,924 మంది (69.47 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నిక బ్యాలెట్‌ విధానంలో జరిగినందున లెక్కింపునకు మొత్తం 28 టేబుళ్లు ఏర్పాటుచేశారు. వాటికి ఎదురుగా ఎన్‌క్లోజర్లు పెట్టి అభ్యర్థుల తరపున ఏజెంట్లు కూర్చునేందుకు కుర్చీలు వేశారు. ఏఏ బూత్‌ల బాక్సులు ఏఏ టేబుల్‌పై లెక్కించాలో ముందుగానే నిర్ణయించి ఆ మేరకు ఎన్‌క్లోజర్లపై స్టిక్కర్లు అతికించారు.