డీజే టిల్లు 2 నుండి టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన చిన్నోడా సాంగ్ రిలీజ్

సిద్దు – అనుపమ జంటగా డీజే టిల్లు 2 తెరకెక్కుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో సినిమాలోని ఫస్ట్ సాంగ్ ను బుధువారం రిలీజ్ చేశారు. డీజే టిల్లు సాంగ్ పాడిన రామ్ మిరియాల ఈ మూవీకి సంగీతం అందిస్తూ ఉండటం విశేషం. టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన చిన్నోడా అంటూ సాగే ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసారు.

కాసర్ల శ్యామ్ ఈ పాటకి లెరిక్స్ అందించగా రామ్ మిరియాల సంగీతం అందించడంతో పాటు ఈ పాట ను పాడారు. ఈ సాంగ్ కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. టిల్లు పబ్ లో అనుపమ ను ఫ్లట్ చేయడం నుంచి సాంగ్ ని స్టార్ట్ చేసి సినిమా లో వాడి క్యారెక్టరైజేషన్ ని పూర్తిగా వివరిస్తూ డీజే టిల్లులో అతను పడ్డ పాట్లుని పరిచయం చేస్తూ సాంగ్ లెరిక్స్ సాగింది. ఓవరాల్ గా ఈ సాంగ్ తో సినిమా ఫై ఆసక్తి పెరిగింది.

YouTube video