‘చైనీస్‌ వైరస్‌’ వ్యాఖ్యలు సమర్థించుకున్న ట్రంప్‌

వైరస్‌ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ప్రాంత పేరు పెట్టి పిలవడం తప్పుకాదు

Donald Trump
Donald Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ కరోనాను ‘ చైనీస్‌ వైరస్‌’ అంటూ ట్వీట్‌ పై చైనా మండిపడ్ని విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలపై ట్రంప్‌ మరోసా స్పందిస్తూ తనను సమర్థించుకున్నారు. కరోనా వ్యాప్తికి అమెరికాయే కారణమంటూ చైనా ఆరోపణలు చేయడం ఏ మాత్రం సరికాదని ట్రంప్ తెలిపారు. అమెరికా సైన్యం వల్లే వైరస్‌ చైనాకు పాకిందంటూ తప్పుడు ఆరోపణ చేశారన్నారు. ఆ వైరస్‌ ఎక్కడి నుంచి వ్యాప్తి అయిందో ఆ ప్రాంత పేరు పెట్టి పిలవడం తప్పుకాదని తెలిపారు. కరోనా ‘చైనీస్‌ వైరస్‌’ అనేది సరైన పదమేనన్నారు. తమ దేశం నుంచి చైనాకు ప్రయాణాలను నిషేధించి తాను మంచిపని చేశానన్నారు. దీనివల్ల ముడిసరకు దిగుమతుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న వాదనను ఆయన తిరస్కరించారు. చైనాకు తమ దేశ ఉత్పత్తుల అవసరం చాలా అవసరం ఉందని, దీంతో సత్సంబంధాలను చైనా కొనసాగిస్తుందని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/