రేపు చరణ్ చేతుల మీదుగా భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్

మెగా ఫ్యాన్స్ కు మెగా కిక్ ఇచ్చారు భోళా శంకర్ మేకర్స్. రేపు సాయంత్రం మెగా పవర్ స్టార్ రామ్ చేతుల మీదుగా భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్ కాబోతున్నట్లు తెలిపి..అభిమానుల్లో సంబరాలు రెట్టింపు చేసారు. వాల్తేర్ వీరయ్య తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. భోళా శంకర్ మూవీ తో ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మెహర్ రమేష్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించగా , కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటించింది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ నుండి అసలు సిసలైన ట్రైలర్ రాబోతుంది. జూలై 27న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా భోళా శంకర్ ట్రైలర్ లాంచ్ జరుగుతుందని మేకర్స్ తెలిపి..మెగా అభిమానుల్లో జోష్ తీసుకొచ్చారు. ఆ మరుసటి రోజే అంటే జూలై 28న పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కలసి నటించిన బ్రో సినిమా విడుదల కాబోతోంది. దీంతో మెగా అభిమానులకు ఇది డబుల్ కాదు ట్రిపుల్ కిక్ అని చెప్పుకోవచ్చు.

తమిళ సూపర్ హిట్ మూవీ ‘వేదాళం’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ బాణీలు కడుతున్నారు.