వైస్సార్ జిల్లాలో విషాదం : ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

వైస్సార్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు , ఓ యువకుడు మృతి చెందిన ఘటన వైస్సార్ జిల్లా వేంపల్లి మండలంలో జరిగింది. మండలంలోని అలవలపాడు గ్రామంలో వేల్పులకు చెందిన జ్ఞానయ్య (25) అలవలపాడు కి చెందిన సాయి సుశాంత్ (8), సాయి తేజ (11), వీళ్ల మేన మామ శశికుమార్ సుజల స్రవంతి కెనాల్ లోకి ఈతకోసం వెళ్లారు. అయితే ఆ కెనాల్ చాలా లోతుగా ఉండటంతో నలుగురిలో శశికుమార్ ఈదుకుంటూ బయట పడ్డారు.

కెనాల్ లోకి వెళ్లిన తర్వాత జ్ఞానయ్యతో పాలు సుశాంత్, సాయి తేజకు ఒక్కసారే ఊపిరి ఆడక మృతిచెందారు. శశికుమార్ పరుగున వెళ్లి విషయం గ్రామస్థులకు తెలియజేయడంతో ముగ్గురినీ వెలికితీసి వేంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సుశాంత్, సాయితేజ తల్లి చనిపోవడంతో అమ్మమ్మ ఇంటికి వచ్చి ఉంటున్నారు. వీరి బంధువు జ్ఞానయ్య ఈస్టర్ పండుగ సందర్భంగా వీళ్ల ఇంటికి వచ్చి అందరూ కలిసి మేనమామ శశికుమార్ తో కెనాల్ కి వెళ్లి ఊపిరి ఆడక చనిపోయారని వేంపల్లి ఎస్సై తిరుపాల్ నాయక్ తెలిపారు.