కృష్ణంరాజుకు ఎలాంటి ప్రమాదం జరగలేదట..

కృష్ణంరాజుకు ఎలాంటి ప్రమాదం జరగలేదట..

రెబెల్ స్టార్ కృష్ణం రాజు ప్రమాదానికి గురయ్యారని.. ఇంట్లో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడ్డారని.. దీంతో ఆయన కాలు ఎముక ఫ్యాక్చర్ అయ్యిందని..ఆయన్ను అపోలో హాస్పటల్ లో జాయిన్ చేసారని ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ వార్తలు చూసి చాలామంది నిజమే కావొచ్చని ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీయడం స్టార్ట్ చేసారు. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అధికారిక ప్రకటన చేసారు.

రొటీన్ హెల్త్ చెకప్ కోసం మాత్రమే కృష్ణం రాజు ఆపోలో ఆస్పత్రికి వచ్చారు తప్ప మరోటి లేదని స్పష్టం చేసారు. త్వరలో ఆయన యూకేకు వెళ్లాల్సి ఉన్నందన ముందు జాగ్రత్తగా.. తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకొనేందుకు ఆయన అపోలో ఆస్పత్రికి వచ్చినట్లు పేర్కొంది. అంతేకాదు.. కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై కూడా కృష్ణం రాజు వైద్యులను అడిగి తెలుసుకున్నారు అని.. ఆయన త్వరగా కోలుకోవాలి అని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన చెప్పారని.. ఆయన కార్యాలయం ప్రకటనలో పేర్కొంది.