కల్తీ మద్యం తాగి ముగ్గురు మృతి

కల్తీ మద్యం తాగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన బీహార్ రాష్ట్రం సరాన్‌ జిల్లా ఛాప్రా ఏరియాలో చోటుచేసుకుంది. గత కొంతకాలంగా బీహార్ లో సంపూర్ణ మద్య నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ కల్తీ మద్యం ఏరులై పారుతున్నది. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు చేపట్టిన..తనిఖీలు చేసిన గుట్టుచప్పుడు కాకుండా కల్తీ మద్యం తయారు చేస్తూ, సరఫరా చేస్తున్నారు.

ఈ క్రమంలో కల్తీ మద్యం తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సరాన్‌ జిల్లా ఛాప్రా ఏరియాలో కల్తీ మద్యం తాగి ముగ్గురు ప్రాణాలు విడిచారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు.. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. అలాగే మరికొంత మంది అస్వస్థతకు గురైతే హాస్పటల్ లో జాయిన్ చేసారు.