రాహుల్ భారత్ జోడోయాత్రలో పాల్గొన్న ఆర్బీఐ మాజీ గవర్నర్

ఆయనతో కలిసి నడుస్తూ పలు విషయాలు చర్చించిన రఘురామ్ రాజన్

Ex RBI governor Raghuram Rajan joins Rahul Gandhi at Bharat Jodo Yatra

న్యూఢిల్లీః కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనతోపాటు నడుస్తూ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు, ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారులు, సామాజిక హక్కుల కార్యకర్తలు పాల్గొన్నారు. తాజాగా, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా ఈ జాబితాలో చేరారు. రాహుల్ జోడో యాత్ర నిన్న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ నుంచి ప్రారంభం కాగా రఘురామ్ రాజన్ ఆయనతోపాటు కలిసి నడిచారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు.

పెద్ద నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో రఘురామ్ రాజన్ కూడా ఉన్నారు. నోట్ల రద్దు కారణంగా దీర్ఘకాలిక ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందంటూ ఆయన తన పుస్తకంలో రాసుకున్నారు. అంతేకాకుండా ఆ ప్రభావం ఆర్థిక వృద్ధి, ద్రవ్యలోటుపైనా పడుతుందని పేర్కొన్నారు. అప్పట్లో నోట్ల రద్దును వ్యతిరేకించిన కాంగ్రెస్‌కు మద్దతునిచ్చిన రఘురామ్ రాజన్.. ఈ ఏడాది కాంగ్రెస్ నిర్వహించిన ఓ సదస్సులోనూ పాల్గొన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/