‘ పీకే లవ్ ‘ అంటూ పూనమ్ కౌర్ ట్వీట్..షాక్ లో నెటిజన్లు

పూనమ్ కౌర్ సోషల్ మీడియా లో ఎప్పుడు హాట్ టాపిక్ గానే నిలుస్తుంటుంది. పవన్ కళ్యాణ్ ఫై ఎవరు విమర్శలు చేసిన ప్రతి సారి ఇన్ డైరెక్ట్ గా పూనమ్ కౌర్ పేరు ప్రస్తావిస్తారు. తాజాగా పోసాని కృష్ణ మురళి తో పాటు పలువురు వైసీపీ నేతలు సైతం ప్రస్తావించారు. గత పది రోజులుగా పూనమ్ పేరు ఏదో ఓ సందర్భంలో వినిపిస్తూనే ఉంది. ఇదిలా ఉండగానే తాజాగా పూనమ్ పీకే లవ్ అనే హ్యాష్ ట్యాగ్ తో వైరల్ గా మారింది.

కేవలం ట్యాగ్ మాత్రమే కాదు కొన్ని ట్రెడిషనల్ లుక్ తాలూకా పిక్స్ షేర్ చేసి హాట్ టాపిక్ అయ్యింది. సడెన్ గా పూనమ్ ఇలా ట్వీట్ చేయడం..పిక్స్ షేర్ చేయడం తో అంత అయోమయంలో పడిపోయారు. నిజానికి పీకే అంటే పూనమ్ కౌర్ అనే అర్ధం వస్తుంది..వేరే అర్ధం కూడా వస్తుంది. మరి ఈ రెండిటిలో అసలు అర్ధం ఏమై ఉంటుందో అని మాట్లాడుకుంటున్నారు.

మరోపక్క మా ఎన్నికలలో కనుక ప్రకాష్ రాజ్ గారు గెలిస్తే తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెడతానని.. ప్రకాష్ గారు గెలిస్తే తనకు నిర్భయంగా అన్యాయాన్ని బయటపెట్టే ధైర్యం వస్తుందనేలా మరో ట్వీట్ చేసింది. దీంతో పూనమ్ కు జరిగిన అన్యాయం ఏంటి.. అసలు అన్యాయం చేసిన వ్యక్తి ఎవరు అనే చర్చ జరిగింది.

#pklove pic.twitter.com/SsnBORfjLW— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 7, 2021