తిరుమలలో మరో రెండు చిరుతలు..

తిరుమల క్షేత్రం సమీపాన్ని చిరుతలు వదలడం లేదు. ముఖ్యంగా నడకదారిలో చిరుతలు సంచరిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఐదు చిరుతలు బాధించిన అధికారులు..ఇక చిరుతలు లేనట్లే అని ఉదయం ప్రకటించారో లేదో..కొన్ని గంటల్లోనే మరో రెండు చిరుతల ఆనవాలు కనిపించాయి. టీటీడీ అధికారులు ట్రాప్ కెమెరాల ద్వారా వీటిని గుర్తించారు. స్పెషల్ టైప్ కాటేజీల వద్ద ఒక చిరుత, నరసింహస్వామి ఆలయం వద్ద మరొక చిరుత సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాల ద్వారా గమనించినట్లు తెలిపారు. వాటిని బంధించేందుకు ఏర్పాటు చేశామన్నారు.

ఆపరేషన్ చిరుత పేరుతో గత రెండు నెలల కాలంలో ఇప్పటివరకు ఐదు చిరుతలను పట్టుకున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. అయితే తాజాగా మరో రెండు చిరుతలను గుర్తించినట్లు గురువారం మధ్యాహ్నం టీటీడీ ప్రకటించింది. దీంతో తిరుమలకు వెళ్లే భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నడకదారిలో వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. అసలు తిరుమల కొండల్లో ఎన్ని చిరుతలు సంచరిస్తున్నాయో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు.