మండలిలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు.. ప్రవేశపెట్టిన బుగ్గన

మూడు రాజధానుల చట్టాన్ని నిన్న ఉపసంహరించుకున్న ప్రభుత్వం

అమరావతి: పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు నిన్న ప్రకటించిన ఏపీ ప్రభుత్వం నేడు ఇందుకు సంబంధించిన బిల్లును శాసనమండలిలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కొద్దిసేపటి క్రితం మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును శాసనమండలిలో ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వికేంద్రీకరణ అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇప్పుడు కనుక ఈ నిర్ణయం తీసుకోకుంటే ఎప్పటికైనా వేర్పాటువాద ముప్పు తప్పదని అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ కూడా ఇదే విషయాన్ని చెప్పిందని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/