చైతు బర్త్ డే గిఫ్ట్ : బంగార్రాజు నుండి చైతు ఫస్ట్ లుక్

అక్కినేని నాగ చైతన్య పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భాంగా అభిమానులు , సినీ ప్రముఖులు చైతు కు బెస్ట్ విషెష్ అందజేస్తున్నారు. ఈ క్రమంలో బంగార్రాజు నుండి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ ను విడుదల చేసి అభిమానుల్లో సంబరాలు నింపారు. ఈ టీజర్ లో బంగార్రాజు ఫోటో వద్ద ఉన్న కళ్ళజోడు,రింగ్స్, చైన్ వేసుకొని దసరా బుల్లోడుగా బైక్ పై బయల్దేరాడు చిన బంగార్రాజు.. పేరును బట్టి చైతూ బంగార్రాజు మనవడిగా కనిపించనున్నట్లు తెలుస్తుంది. అచ్చుగుద్దినట్లు తాత బంగార్రాజును కాపీ కొడుతున్నట్లు కనిపించింది. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది.

కింగ్ నాగార్జున , చైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు. “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రానికి ఇది సిక్వెల్ గా తెర‌కెక్క‌తుంది. ఈ చిత్రంలో నాగ్ “బంగార్రాజు” పాత్రల్లో కనిపించ‌బోతున్నారు. నాగ్‌ కు జోడీ గా రమ్యకృష్ణ, నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు.

YouTube video