ప్రగతిభవన్ లో ఆ నలుగురు ఎమ్మెల్యే లు

బిజెపి డబ్బుకు ఏమాత్రం లొంగకుండా పక్క ప్లాన్ తో బిజెపి ప్లాన్ ను రివర్స్ చేసి..నిజమైన తెలంగాణ హీరోలు అనిపించుకున్నారు గువ్వల బాలరాజు, పైలెట్‌ రోహిత్‌రెడ్డి, రేగ కాంతారావు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి. ప్రస్తుతం ఈ నలుగురు ఎమ్మెల్యే లను టిఆర్ఎస్ కార్యకర్తలు నిజమైన హీరోలను ప్రశంసలు కురిపిస్తున్నారు. బీజేపీతో చేస్తున్న రాజకీయ యుద్ధంలో న్యాయం, ధర్మం వైపు నిలబడ్డారని.. పనులకు, పైసలకు అమ్ముడుపోతున్న నేటిరోజుల్లో నిఖార్సయిన కేసీఆర్‌ సైనికుల్లా వీరు తలపడ్డారని టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురంగా చెప్తున్నాయి. ప్రస్తుతం ఈ నలుగురు ఎమ్మెల్యే లు ప్రగతి భవన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈరోజు (గురువారం) ఉదయం 11 గంటల తర్వాత సీఎం కేసీఅర్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

రాష్ట్రంలో మునుగోడు ఎన్నికల వేడి నెలకొన్న తరుణంలో.. నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడం భంగపడడం రాజకీయంగా దుమారం రేపుతున్నది. మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 18వేల కోట్ల కాంట్రాక్టు పొందిన తర్వాతే బీజేపీలో చేరారని, కాంట్రాక్టు పనులకు ఆయన అమ్ముడుపోయాడని ఇప్పటికే ప్రచారం జరుగుతూ వస్తుంది. ఇదే విషయమై నియోజకవర్గం అంతా ఇప్పటికే పోస్టర్లు వెలిశాయి. ఇక ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్యేలు వంద కోట్ల డబ్బు ఇస్తామన్నా పట్టించుకోకుండా.. రాజకీయ నిబద్ధతను చాటుకున్నారని విశ్లేషకులు చెప్తున్నారు.