రైలు స్పీడ్ చూసి పరుగులు పెట్టిన జనాలు

బుధువారం బొగ్గు లోడుతో వెళ్తున్న ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పి బోల్తాపడిన ఘటన బిహార్‌లోని గయా ప్రాంతంలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ, గూడ్సు రైలుకు 58 వ్యాగన్ల ఉండగా.. 53 చెల్లాచెదురయ్యాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బ్రేక్‌ విఫలమవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సిబ్బంది ప్రాథమికంగా గుర్తించారు. కాగా ఈ ఘటన కు సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

బుధవారం ఉదయం 6.24 గంటలకు ప్రయాణికులు రైలు కోసం రైల్వే స్టేషన్‌లో ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఓ రైలు ఇంజిన్‌ జెట్ స్పీడ్ తో వెళ్ళింది. ఇంజిన్‌కి ఒక్క డబ్బా మాత్రమే ఉన్నది. అప్పటికే ఆ రైలుకు ఉన్న 58 కోచ్‌లలో 53 కోచ్‌లు చెల్లాచెదురయ్యాయాయి. ఓ బోగీ పట్టాలు తప్పినప్పటికీ ఇంజిన్‌ నుంచి విడిపోలేదు. అయినప్పటికీ ఆగని ఆ రైలు.. బోగీని గుంజుకుంటూ జెట్‌ స్పీడ్‌లో రెప్పపాటులోనే స్టేషన్‌ను దాటేసింది. దీంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు స్టేషన్‌ నుంచి పరుగులు పెట్టారు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.