భారత్‌పై పాక్ క్రికెటర్ ప్రశంసలు

shoaib akhtar Appreciated to team india
shoaib akhtar Appreciated to team india

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ కోహ్లీసేనపై ప్రశంసల జల్లు కురిపించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఆకాశానికెత్తాడు. ఈ సిరీస్ రెండు జట్ల మధ్య జరిగిన సాదాసీదా పోరు కాదని, భారత్-ఆసీస్ ఆత్మగౌరవ యుద్దమని అభివర్ణించాడు. కోహ్లీ నేతృత్వంలోని ప్రస్తుత జట్టు… తాను ఆడిన రోజుల్లోని టీమిండియాలా కాదన్నాడు. బెంగళూరు వేదికగా జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన కోహ్లీసేన వన్డే సిరీస్‌ను 21తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షోయబ్‌ పై విధంగా స్పందించారు. విరాట్ కోహ్లీ ఓ అసాధారణ కెప్టెన్. ధృడసంకల్పం కలిగిన వ్యక్తి. ఓటమి నుంచి ఎలా పుంజుకోవాలో కోహ్లికి, అతని ప్లేయర్లకు బాగా తెలుసు. ఎలాంటి అవకాశాన్ని వదులుకోడు. అది బెంగళూరు వేదికగా ప్రత్యర్థి 300 లోపు లక్ష్యాన్ని నిర్ధేశిస్తే.. రోహిత్, ధావన్, అయ్యర్, రాహుల్ వంటి మేటీ ఆటగాళ్లున్న జట్టు ఛేదనను అడ్డుకోవాలనుకోవడం వృథా ప్రయాసే.’అని షోయబ్ తెలిపాడు. ఈ సిరీస్ ఇరు జట్ల మధ్య జరిగిన ఆత్మగౌరవ పోరు. ప్రస్తుత టీమ్ నేనాడినప్పటి ఇండియా కాదు. పూర్తిగా విభిన్నం. తొలి మ్యాచ్ ఓడిన తర్వాత సిరీస్ గెలవడం చాలా కష్టం. కానీ కోహ్లీసేన అదరగొట్టింది’అని స్పీడ్ స్టార్ చెప్పుకొచ్చాడు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/