తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా

Rohit Sharma
Rohit Sharma

ముంబయి: భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న భారత్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. ప్రత్యర్థి దాటికి ఏమాత్రం భయపడని హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ వికెట్‌ను టీమిండియా పోగొట్టుకుంది. ఐదో ఓవర్ మూడో బంతికి స్కోరు 13 పరుగులవద్ద ఉన్నప్పుడు స్టార్క్ వేసిన బంతిని గాల్లోకి లేపిన రోహిత్ మిడ్ ఆఫ్ లో వార్నర్ క్యాచ్ పట్టగా పెవిలియన్ చేరాడు. రోహిత్ 15 బంతుల్లో 10 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లున్నాయి. అనంతరం క్రీజులోకి కెఎల్ రాహుల్ వచ్చాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత ఓపెనెర్లు ధావన్, రోహిత్ లు బ్యాటింగ్ ప్రారంభించారు. మిచెల్ స్టార్క్, కమిన్స్ లు పకడ్బందీగా బంతులు వేస్తూండటంతో పరుగులు కష్టంగా వస్తున్నాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/