22వేల క్లబ్‌లో విరాట్‌

462 ఇన్నింగ్స్‌లలో 22,011 పరుగులు

Virat Kohli
Virat Kohli


సిడ్నీ : అంతర్జాతీయ క్రికెట్‌లో 22 వేల పరుగులు సాధించిన వారి సరసన భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికూడా చేరాడు.

ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన రెండో వన్డే సందర్భంగా కోహ్లి ఈ మైలురాయి చేరుకున్నాడు. కాగా కోహ్లి అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా ఘనత సాధించాడు.

కోహ్లీ అతి తక్కువగా 462 ఇన్నింగ్స్‌లలో 22,011 పరుగులు చేశాడు. ఈ ఘనతను అందుకున్న మూడో భారత ఆటగాడు కోహ్లి.

గతంలో సంచిన్‌ టెండూల్కర్‌(34,357), రాహుల్‌ ద్రవిడ్‌(24,208) ఈ ఘనతను సాధించాడు.

సచిన్‌ అగ్రస్థాంనలో నిలవగా, ద్రవిడ్‌ ఆరో స్థానంలో ఉన్నాడు. మొత్తంగా ఈ ఘనత సాధించిన ఎనిమిదో ఆటగాడు కోహ్లి.

24వేల పరుగుల క్లబ్‌ ఆటగాళ్లు :

1.సచిన్‌ టెండూల్కర్‌(34,357-782 ఇన్నింగ్స్‌), 2.కుమార సంగక్కర(28,016-666 ఇన్నింగ్స్‌), 3.రికీ పాంటింగ్‌(27,483-668 ఇన్నింగ్స్‌), 4.మహేల జయవర్ధనె(25,957-725 ఇన్నింగ్స్‌), 5.జాక్వెస్‌ కలిస్‌(25,534-617 ఇన్నింగ్స్‌), 6.రాహుల్‌ ద్రవిడ్‌(24,208-605 ఇన్నింగ్స్‌), 7.బ్రయాన్‌ లారా(22,358-521 ఇన్నింగ్స్‌), 8.విరాట్‌ కోహ్లి(22,011-462 ఇన్నింగ్స్‌).

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/