భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేంత శక్తి లేదు

Malaysian-PM Mahathir
Malaysian-PM Mahathir

కౌలాలంపూర్‌: పామాయిల్ వాణిజ్య ఒప్పందాన్ని రద్దుచేసుకున్న భారతదేశంపై ప్రతీకారం తీర్చుకునేంత శక్తి మలేషియాకు లేదని మలేషియా ప్రధాని మహతిర్ మొహమ్మద్ సోమవారం వ్యాఖ్యానించారు. భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేంత పెద్దవాళ్లం కాదని, ఈ సమస్యను ఎదుర్కోవడానికి మార్గాలను వెతుక్కోవలసి ఉంటుందని మలేషియా పశ్చిమ కోస్తా ప్రంతంలోని లాంగ్‌కావి దీపంలో మీడియాతో మాట్లాడుతూ మహతిర్ అన్నారు. కశ్మీరుపై భారత ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ మలేషియా ప్రధాని చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా ఆ దేశం నుంచి పామాయిల్ దిగుమతులను భారత్ ఈ నెలలో నిలిపివేసింది. మలేషియా నుంచి అత్యధికంగా పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నది భారత్ మాత్రమే కావడం గమనార్హం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/