టీడీపీ గెలుపునకు ప్రధాన కారణాలు ఇవే..

ఏపీలో కూటమి సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్ కు మించి స్థానాలు సాధించి..వైసీపీ కి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది. ఈ ఫలితాలతో ప్రజలు జగన్ ఫై ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థమైంది. టిడిపినే కాదు జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా విజయం సాధించింది. కంచుకోటల్లాంటి నియోజకవర్గాలను వైసీపీ కోల్పోయింది. విశాఖపట్నం- 2, చిత్తూరు-2, కడప- 3, కర్నూలు- 2, ప్రకాశం- 1.. ఇవీ ఆ పార్టీ అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాల సంఖ్య.

ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు 5 కారణాలు పనిచేసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లా ఓట్లు చీలకుండా జనసేనతో కూటమి ఏర్పాటు చేయడం, బీజేపీని కూటమిలోకి తీసుకోవడం, నారా కుటుంబసభ్యులందరూ ఎన్నికల్లో ప్రచారం చేయడం, స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టుతో సానుభూతి, ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రచారం వంటి అంశాలు టీడీపీకి విజయాన్ని కట్టబెట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ కారణాలే ఆ పార్టీకి ఓట్లు పడేలా చేశాయి.