నా ఆరోగ్యం బాగానే ఉందని విక్రమ్ వీడియో రిలీజ్

నా ఆరోగ్యం బాగానే ఉందని తీపి కబురు తెలిపి అభిమానుల్లో ఆందోళన తగ్గించారు హీరో విక్రమ్. మూడు రోజుల క్రితం విక్రమ్ అస్వస్థతకు గురై చెన్నైలోని కావేరి హాస్పటల్ లో చేరిన సంగతి తెలిసిందే. విక్రమ్ హాస్పటల్ లో చేరిన విషయం తెలిసి అంత ఖంగారు పడ్డారు. ఇదే క్రమంలో విక్రమ్ గుండెపోటుకు గురయ్యారని , అందుకే హాస్పటల్ లో చేరారనే వార్తలు ప్రచారం కావడం తో ఇంకాస్త ఖంగారుపడ్డారు. కానీ గుండెపోటు కాదని స్వల్ప అనారోగ్యమే అని కుటుంబ సభ్యులు, డాక్టర్స్ అధికారిక ప్రకటన చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు విక్రమ్ ట్విట్టర్ ద్వారా ఓ వీడియో రూపంలో తెలియజేసాడు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తనపై ప్రేమ, అభిమానం చూపించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇంతమంది ప్రేమ కనబరచడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అయితే ఈ వీడియోపై స్పందిస్తున్న.. ఆయన కోలుకోవడం ఆనందంగా ఉందంటూ పోస్ట్​లు పెడుతున్నారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని.. ఆ తర్వాత సినిమా షూటింగ్స్​లో పాల్గొనాలంటూ సూచిస్తున్నారు. ‘అపరిచితుడు’ చిత్రంతో విక్రమ్‌ తెలుగువారికి ఎంతో చేరువయ్యారు. ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలు ఇక్కడా విడుదలై మన వారిని బాగా అలరించాయి. ప్రస్తుతం ఆయన ‘కోబ్రా’, మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.

#ChiyaanVikram Sir is Discharged for today !♥️🙏🏽

Waiting to see #CobraAudioLaunch pic.twitter.com/oDUPlJmebl
— ChiyaanMathanCvf (@mathanotnmcvf) July 9, 2022