తిరుమలలో వైభవంగా జరిగిన ఉగాది ఆస్థానం

పరిమిత సంఖ్యలోనే ఆలయ సిబ్బంది, అర్చకులు

tirumala
tirumala

తిరుమల: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారికి ఉగాది ఆస్థానంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలు సమర్పించారు. ఆ తరువాత శ్రీవారి పాదాలచెంత ఉంచిన శార్వారినామ సంవత్సర పంచాంగాన్ని తీసుకుని టిటిడి ఆస్థాన సిద్దాంతి పంచాంగ శ్రవణం చేశారు. అయితే ఈ ఉగాది ఆస్థానంలో పరిమిత సంఖ్యలో అర్చకులు, సిబ్బంది పాల్గోన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/